తెలంగాణలో ఒలింపిక్స్ నిర్వహించడమే నా లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధిస్తున్నాయని.. మనం ఎందుకు సాధించలేమని రేవంత్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. పతకాలు సాధించడం అసాధ్యం కాదని.. తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్స్ పతకాలు సాధించడమే తన లక్ష్యంగా ప్రకటించారు. అందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణకు ISB విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా పేర్కొన్నారు.
ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం అనేది చాలా ముఖ్యం అన్నారు. తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పని చేయడంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరం అని.. తన జీవితం గురించి రేవంత్ రెడ్డి తెలిపారు. గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేమని పేర్కొన్నారు. ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు పెట్టుకోవాలని.. స్నేహభావంతో అందరినీ కలుపుకొని పోవాలన్నారు.తెలంగాణ ను ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థ గా మార్చాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.