కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా ? : కేటీఆర్

-

తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. 9 గంటల కరెంట్ ఇస్తామని 2009 ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం రైతుల ధర్నాలు, సబ్ స్టేషన్ లో ధర్నాలు చేస్తున్నారు. 70 లక్షల మంది రైతులను కాంగ్రెస్ బిచ్చగాళ్లతో పోల్చిందని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఉన్నోళ్లంతా చిన్న, సన్నకారు రైతులే.. మూడు గంటలు చాలు అని మాట్లాడుతున్నారు. ప్రతీ నీటిని బొట్టును ఒడిసిపట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తాగునీటి కోసం అద్భుతంగా తీర్చిదిద్దింది. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు.

కాలువల మీద ఎన్ని మోటార్లు పెట్టి నీళ్లు తోడుకున్న రైతును అడిగేటోడే లేడు. సంవత్సరానికి 12వేల కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని తెలిపారు. రైతు అన్న ఆలోచించు.. కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా ? అంటారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఓ వైపు మోడీ అంటాడు.. మరోవైపు మూడు గంటలు కరెంట్ చాలు అని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు. 15వ స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ నెంబర్ స్థానంలో ఉన్నామని తెలిపారు. వరి ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version