తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నీళ్లు, నిధులు, నియామకాల గురించి కొట్లడలేదు. సీమాంధ్ర పాలనలో మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ ఇచ్చారు కదా!నీళ్లు, నిధులు, నియామకాల కోసమే అయితే తెలంగాణ అవసరం లేదు. టిక్కెట్లు అమ్ముకుంటున్న “రేటెంత రెడ్డి” అని నన్ను పిలిస్తే గర్వంగా ఫీలవుతా.. టిక్కెట్లు వచ్చిన వాడు, రాని వాడు ఎవడైనా నా పేరు చెప్పాల్సిందే అని పేర్కొన్నారు.
3 గంటల విద్యుత్ మాటలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాని వాడు కూడా సీఎం అవొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లో మాత్రం కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతున్నారని పేర్కొన్నారు. గెలిచినా.. ఓడినా ప్రజల్లోనే ఉంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరగలేదని తెలిపారు.