పటాన్‌చెరు నుంచి బీఎస్పీ అభ్యర్ధిగా నీలం మధు నామినేషన్ !

-

నీలం మధు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పటాన్‌చెరు నుంచి బీఎస్పీ అభ్యర్ధిగా నీలం మధు నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారని సమాచారం అందుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశపడి భంగపడ్డారు నీలం మధు ముదిరాజ్. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మొదట నీలం మధు ముదిరాజ్‌ కు ఇచ్చింది అధిష్టానం. కానీ పటాన్ చెరులో నీలం మధు స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్‌ ఇచ్చారు. అయితే.. దీనిపై నీలం మధు ముదిరాజ్‌ సీరియస్‌ అయ్యారు.

Neelam Madhu nomination as BSP candidate from Patancheru

ఈ సందర్భంగా ఆయన స్థానికంగా వచ్చిన అభిమానులతో మాట్లాడుతూ పటాన్చెరులో నీలం మధు ముదిరాజ్ ఇండిపెండెంట్గా కచ్చితంగా పోటీలో ఉంటా అని ప్రకటించారు. ఎవరు అధైర్య పడద్దని అభిమానులను కోరారు. తనకు టికెట్ కాకుండా చేసిన దామోదర్ రాజనర్సింహను ఆందోల్ లో కచ్చితంగా ఓ బీసీ బిడ్డగా ఓడిస్తానని ప్రతిజ్ఞ చేశారు నీలం మధు ముదిరాజ్‌. టికెట్ ఇవ్వకుండా మొన్న బీఆర్ఎస్ మోసం చేస్తే, ఇవ్వాల టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొని కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహించారు.ఇక ఇప్పుడు పటాన్‌చెరు నుంచి బీఎస్పీ అభ్యర్ధిగా నీలం మధు నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version