చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ కేసులో మెడికల్ గ్రౌండ్స్ పై నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు బయట ఉన్నారు. నవంబర్ 28న మధ్యంతర బెయిల్ ముగుస్తుంది.
ఇక ఇవాళ హైకోర్టులో ఇదే కేసుకు సంబంధించి చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై మరోసారి విచారణ జరగాల్సి ఉంది. ఆ కేసు విచారణను ఈ నెల 15 కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది ఏపీ హైకోర్టు. గత విచారణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చంద్రబాబు రాజకీయ ర్యాలీలు చేయకూడదు. కేసుకు సంబంధించి ఎక్కడ మాట్లాడకూడదు. అయితే కంటి శాస్త్ర చికిత్స, ఇతర మెడికల్ గ్రౌండ్స్ పై ఇచ్చిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ గడువు మరో 18 రోజుల్లో ముగుస్తుంది.