హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నీరా కేఫ్, ఫుడ్ కోర్టులను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ప్రారంభించారు. అనంతరం నీరా కేఫ్, ఫుడ్ కోర్టులు కలియతిరిగి పరిశీలించారు. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు ఇద్దరూ ఇతర నేతలతో కలిసి నీరా సేవించారు. వారితో పాటు ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన కర్ణాటక స్వామీజీలు కూడా నీరా సేవించారు.
నీరా అంటే ఆల్కహాల్ అనే దుష్ప్రచారం ఉందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నిజానికి ఇది స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న అమృతం అని అన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీక నీరా కేఫ్ అని తెలిపారు.
‘తరరతాల నుంచి వస్తున్న గీత వృత్తి. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ తరహా నీరా కేఫ్ లేదు. ఆత్మగౌరవానికి ప్రతీక నీరా కేఫ్ . బహుళ పోషకాల గని నీరా. నీరా అంటే ఆల్కహాల్ అనే దుష్ప్రచారం ఉంది. స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న అమృతం.’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.