సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం ఫైనల్ అయ్యారు. పొత్తులో భాగంగా… సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం ఫైనల్ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.

ప్రస్తుతం నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న నెల్లికంటి సత్యంకు అవకాశం కల్పించారు. అయితే…ఈ సారి నల్గొండకే నాలుగు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), కేతావత్ శంకర్ నాయక్ (కాంగ్రెస్), నెల్లికంటి సత్యం (సీపీఐ), దాసోజు శ్రవణ్ (బీఆర్ఎస్) ఈ నలుగురిది కూడా నల్గొండ కావడం గమనార్హం.