తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను పెంచాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఉత్తర్వులను, ప్రక్రియాను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాజా గా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలును పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర ను కూడా వేసింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు కొత్త మార్కెట్ విలువలు అమలులోకి రానున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ కొత్త మార్కెట్ విలువలు అమలులోకి రానున్నాయి. కాగ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రార్ కు ఇప్పటికే ఫీజు చెల్లించి.. రిజిస్ట్రేషన్ కాని వాళ్లుకు ఇది అమలు కాదు. కొత్త గా భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్లకు మాత్రమే ఈ కొత్త మార్కెట్ విలువల అమలు కానున్నాయి. కాగ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువను ప్రతి ఏడాది పెంచుతామని ప్రకటించింది.
దీంతో గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భుముల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. గత వారం నుంచి రిజిస్ట్రేషన్ శాఖ ప్రతి రోజు రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అలాగే కొత్త మార్కెట్ విలువలు అమలులోకి వస్తే.. కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరే అవకాశం ఉంది.