పవన్ కళ్యాణ్ “OG” నుంచి కొత్త పోస్టర్..!

-

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఓవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. ఫస్ట్ హరిహరవీరమల్లు చిత్రం పూర్తి చేసిన తరువాత ప్రెస్టీజియస్ చిత్రం “OG” చేయనున్నారు. అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా “OG” మూవీని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండటంతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రానుంది.

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ భారీ అంచనాలనే పెంచేశాయి. తాజాగా ఓ సాలిడ్ కవర్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ముంబై లోని గేట్ వే ఆఫ్ ఇండియా ముందు విధ్వంసం సృష్టించి మరణ మృదంగం మోగించిన ఓజీని మనకు ఇందులో చూపెట్టారు. పవన్ ని డార్క్ షేడ్స్ లో చూపెట్టినా.. అభిమానులకు ఈ కవర్ పోస్టర్ పిచ్చిగా ఎక్కేసింది. ఈ దారులు తిరిగి ఎప్పటికీ మళ్లీ అలా కనిపించవు అనే క్యాప్షన్ ను ఈ పోస్టర్ కు జత చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version