మంత్రాలు, తంత్రాలు అనే నెపంతో కేసిఆర్ సచివాలయానికి వెళ్లలేదు – నిర్మలా సీతారామన్

-

మంత్రాలు, తంత్రాలు అనే నెపంతో కేసిఆర్ సచివాలయానికి వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ తో TRS ఆవిర్భవించిందని.. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే మూడు నినాదాలతో TRS ముందుకి వెళ్లిందని ఫైర్‌ అయ్యారు. కుల రహిత సమాజం నిర్మించడమే TRS లక్ష్యం అన్నారు… 2014 నుంచి 2018 వరకు మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదని మండిపడ్డారు.

రెండో సారి అధికారంలోకి వచ్చాక తొలుత మహిళలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదని.. ప్రతి పక్షాలు మీడియా ప్రశ్నించడంతో మహిళలకు మంత్రి వర్గంలో చోటు దక్కిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు…TRS హయాంలో తెలంగాణకు 3లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు లక్షల కొట్లు ఖర్చు చేసారు కానీ చుక్క నీరు రాలేదని.. నియామకాలన్న కేసీఆర్ రాష్ట్రంలో ఎందుకు ఉద్యోగాల భర్తీ జరపట్లేదని ఆగ్రహించారు. TRS సర్కారు నీళ్ళు, నిధులు, నియామకాలు కల్పించడంలో పూర్తీగా విఫలమైందని నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version