GHMC మేయర్ గద్వాల విజయ లక్ష్మి పై అవిశ్వాస తీర్మానం?

-

తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు తాజాగా సమావేశం అయ్యారు. ముఖ్యంగా  ఈ సమావేశానికి  ఎమ్మేల్యేలు బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆరికేపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ డుమ్మా కొట్టారు. దాదాపు 10 మంది వరకు కార్పొరేటర్లు హాజరు కాలేదు.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. అందుకు నిర్వహించిన సమావేశానికి  ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, పద్మారావు, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. తలసాని నేతృత్వంలో సమావేశం జరిగింది. పార్టీ మారిన GHMC మేయర్ గద్వాల విజయ లక్ష్మి పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ కు వ్యతిరేకంగా నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version