కేసీఆర్ పదేళ్ల పాలనలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదు : హరీశ్ రావు

-

కేసీఆర్ పదేళ్ల పాలనలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కేఆర్ఎంబీకీ ప్రాజెక్టులను అప్పగించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వ్యవహరించకూడదు. రాజకీయాలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు హరీశ్ రావు.

నెలరోజుల లోపు  ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తారని సమావేశంలో స్పష్టం చేశారు. 2024 ఫిబ్రవరి 01న కేఆర్ఎంబీ మీటింగ్ జరిగిందని హరీశ్ రావు తెలిపారు. ప్రాజెక్టులను అప్పగించిన తరువాత.. అప్పగించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రంకెలేస్తుందన్నారు హరీశ్ రావు. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్టు మీటింగ్ మినిట్స్ ఉన్నదని హరీశ్ రావు స్పష్టం చేశారు.బట్ట కాల్చి మా మీద వేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే జులై 04, 2005న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులుగా రాజీనామా చేశామని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా అబద్దాలు చెప్పారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version