లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్ పై బదిలీ వేటు పడింది. మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా చేసిన ఫిర్యాదు మేరకు స్పందించారు తెలంగాణ పోలీసులు. బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తోసుకొని.. అతడిని ఆ స్టేషన్ నుంచి బదిలీ చేశారు.
అంతకు ముందు పోలీసుల వ్యవహార శైలిపైన డీజీపీని మరోసారి ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….. వినరాని భాషలో పోలీస్ సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడంపై అభ్యంతరం తెలిపారు. ఇది పోలీస్ శాఖకు, డీజీపీకి అంగీకారయోగ్యమైన భాషనా అని ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలన్న కేటీఆర్….ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్న పోలీసులు చర్యలు తీసు కోవడం లేదని నిప్పులు చెరిగారు.