తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ నెం.533 వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో సూర్యారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి భవనానికి రహదారి అవసరాల కోసం సూర్యారావుకు చెందిన ప్లాట్‌ను సేకరించగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
భూసేకరణ చట్టం కింద సేకరించాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా తనకు మరో ప్లాటు కేటాయించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సోమేశ్‌కుమార్‌కు జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.