హైదరాబాద్‌లో హోటళ్ల‌కు నోటీసులు..జూన్ 1 నుంచి కొత్త రూల్స్ !

-

హైదరాబాద్‌లో హోటళ్ల‌కు నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు గత 42 రోజుల్లో 83 రెస్టారెంట్లు, తదితర హోటల్స్ ను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి మే 27 వరకు రైడ్స్ జరిగాయన్నారు. గ్రేటర్ లో నిలువ చేసిన మాంసం, ఎక్స్ పైరి అయిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డించిన 58 రెస్టారెంట్లు, అపరిశుభ్రతతో పాటు లైసెన్స్ లేని మరో 10 ఓటర్లకు నోటీసులు అందించామన్నారు. ఇక జూన్ 1 నుంచి నిబంధనలు పాటించని హోటళ్లకు ఫైన్ విధించనున్నారు.

Notices for hotels in Hyderabad

కాగా, షాద్‌నగర్ లోని అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈనెల 22న షాద్‌నగర్‌లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. ఇంటికి చేరుకున్నాక ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.. నరేందర్‌కు రక్తపు వాంతులు, విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version