BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. దళిత బంధు రెండవ విడత డబ్బులు విడుదల చేయాలంటూ ఈ నెల 9వ తేదీన హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ధర్నా, రాస్తారోకో చేసిన సంగతి తెలిసిందే.
ధర్నా, రాస్తారోకోకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదట BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆ తరుణంలోనే..BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. సెక్షన్ 35(3) బీఎన్ఎస్ యాక్టు ప్రకారం కౌషిక్ రెడ్డి, బీఅర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు పోలీసులు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలిసుల నోటీసులు ఇవ్వడంపై ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందించలేదు. పోలీసుల నోటీసులపై స్వయంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ఛాన్స్ ఉంది.