బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే… ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందినట్లు చెబుతున్నారు.
నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ అయ్యాయని అంటున్నారు.
నిందితుడు తిరుపతన్నతో ఫోన్ కాంటాక్ట్స్ ఉండడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. లింగయ్యను విచారించిన తర్వాత ఈ నలుగురిని పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అదనపు ఎస్పీ తిరుపతన్నతో కాంటాక్ట్‌లో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు…ఉన్నారు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయిన కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం
ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ
లింగయ్యను విచారించిన తర్వాత ఈ నలుగురిని పిలిచే అవకాశం… https://t.co/1D6RxwfbW0
— BIG TV Breaking News (@bigtvtelugu) November 12, 2024