తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే (కులగణన)కు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఇది మాన్యువల్ పెగాసెస్’ కుల గణనను మేం వ్యతిరేకించడం లేదు.. కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం..
ప్రజల నుంచి వారి వ్యక్తిగత సమాచారం మొత్తం తీసుకుంటున్నారు. ఆ అవసరం ఏముంది? ప్రయివేటు వ్యక్తులతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. దానికి భద్రత ఏదీ? అని కేటీఆర్ ప్రశ్నించారు.కులగణన కోసం కేవలం క్యాస్ట్ వివరాలు ఒక్కటి, ఇంట్లోని కుటుంబీకుల వివరాలు సరిపోవా? భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై ఫైర్ అయ్యారు.