BREAKING : అక్టోబర్ 10న కాంగ్రెస్‌ అసెంబ్లీ టిక్కెట్ల ప్రకటన !

-

రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” సమావేశం జరుగనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ “వార్ రూమ్”లో ఈ సమావేశం జరుగనుంది. అభ్యర్ధుల ఖరారు ప్రక్రియను వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. వచ్చే మంగళవారం (అక్టోబర్ 10) కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” సమావేశం జరుగనుంది. ఇక వచ్చే మంగళవారం ( అక్టోబర్ 10) తెలంగాణ అసెంబ్లీ టిక్కెట్లను ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ.”

ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ.” పార్టీ “వార్ రూమ్” లో ఆదివారం జరిగే సమావేశంలోఖరారైన అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” కి సిఫార్సు చేయనుంది “స్క్రీనింగ్ కమిటీ”. తెలంగాణ అసెంబ్లీకి అభ్యర్ధులను విడతల వారీగానా…!? లేదా ఒకేసారి మొత్తం జాబితాను ప్రకటిస్తారా అనే అంశంలో ఇంకా క్లారిటీ రాలేదు. అభ్యర్దుల ఖరారు ప్రక్రియను ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా, వేగవంతంగా పూర్తి చేసి ఎన్నికలకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version