దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందనే ఆరోపణలతో బంధువులు ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని దేవరకొండలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. బంధువుల కథనం ప్రకారం.. దేవరకొండ చుట్టుపక్కల గ్రామం నుంచి ఓ మహిళ ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది.
మహిళకు డాక్టర్లు డెలివరీ చేయగా శిశువు మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. గవర్నమెంట్ హస్పిటల్ పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పసికందు మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై వైద్యులను వివరణ కోరగా సరైన సమాధానం ఇవ్వట్లేదని బాధితురాలి బంధువులు వెల్లడించారు.