స్థానిక సంస్థల ఎన్నికలు, ఏడాది పాలన పై చర్చించడానికి కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్ లో సమావేశం కానుంది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దీపా దాస్ మున్షీతో సహా 23 మంది పీఏసీ సభ్యులు హాజరు కానున్నారు. ఇచ్చిన, నేరవేర్చిన హామీలు, స్థానిక సంస్థలలో పార్టీ విజయానికి కృషి చేసే విధంగా పార్టీ కీలక నేతలకు కేసీ వేణు గోపాల్ దిశా నిర్దేశం చేయనున్నారు.
కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకోవడం పార్టీ కార్యక్రమాలు, పార్టీ కేడర్ కి ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండేవిధంగా సూచనలు ఇవ్వనున్నారు. త్వరలో ప్రారంభించనున్న రైతు భరోసా, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్స్ ను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా చూడనున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా కొందరూ ప్రజా ప్రతినిధుల తీరు ఇంకా ఆశాజనకంగా లేదని గుర్తించారు.