మంచినీటి వృధాపై జలమండలి అధికారుల డ్రైవ్ చేసింది. ఇందులో భాగంగానే… బంజారాహిల్స్ లోని పలు ఏరియాల్లో తనిఖీలు చేశారు అధికారులు. జలమండలి సరఫరా చేస్తున్న నీటిని వృధా చేస్తున్న వారిని గుర్తించి ఫైన్ వేస్తున్నారు అధికారులు. జలమండలి ఇస్తున్న వాటర్ తో వాహనాలు, గల్లీలు, ఇంటి పరిసరాలు క్లీన్ చేస్తున్నారని కంప్లెయింట్స్ వస్తున్నాయని… జలమండలి అధికారుల డ్రైవ్ చేసింది.

సమ్మర్ లో నీటి కొరత ఉండటంతో మంచినీటి ని వృధా చేయొద్దని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో మంచినీటి వృదాపై జలమండలికి వస్తున్నాయి కంప్లెయింట్స్. ఇక ఈ రోజు నుంచి ప్రతీరోజు తనిఖీలు నిర్వహిస్తామంటున్నారు అధికారులు. మంచినీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటుని హెచ్చరిస్తున్నారు అధికారులు. పది రోజుల క్రితం వెహికిల్స్ క్లీన్ చేస్తున్న వారికి వెయ్యి రూపాయల ఫైన్ వేశారు జలమండలి అధికారులు.