ఈనెల 26న తెలంగాణలో కోటి మొక్కల కార్యక్రమం

-

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగింపు కూడా అంతే ఘనంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ విషయాన్ని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాల్టీల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంఘాలు, సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు సూచించారు.

సంక్షేమ పథకాల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో శుక్రవారం రోజున సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణకు హరితహారం, దశాబ్ది సంపద వనాలు, స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటడం, గొర్రెల పంపిణీ, బీసీలు, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, గృహలక్ష్మి, దళితబంధు, భూపట్టాల పంపిణీ, సామాజిక భద్రతా పింఛన్లు, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్ధీకరణ, వీఆర్వోల క్రమబద్ధీకరణపై సమీక్షించారు. వివిధ జిల్లాల్లో 1266 మందికి కారుణ్య నియామకాలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version