తెలంగాణలో అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ అభ్యర్థుల జాబితా వస్తుంది అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరూ వాళ్లు ఉన్నటువంటి పార్టీలో మనుగడ లేక పార్టీలు మారుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని పేర్కొన్నారు. నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని .. తక్షణమే 220 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.
మరోవైపు తెలంగాణ పై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. మూడు రాష్ట్రాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై నివేదికను సమర్పించనున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలనే కమలదళం వ్యూహ రచన చేస్తుంది.ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎమ్మెల్యేలు ఆగస్టు 19న హైదరాబాద్ కి రానున్నారు. వర్క్ షాపు నిర్వహించిన అనంతరం వారికి నియోజకవర్గాలు కేటాయించనున్నారు.