తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

-

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 06 నుంచి 30 వరకు ఒంటి పూడ బడులు కొనసాగనున్నాయి. ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వే లో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల టీచర్లను వినియోగించుకోనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పని చేస్తాయి.

సర్వే పూర్తయ్యే ఈ ఒంటిపూట బడులు కొనసాగుతాయి. ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొనబోతున్నారు. నవంబర్ 30 లోపు ఈ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 వేల మంది ఎన్యుమరేటర్లు ఈ కులగణన సర్వేలో పాల్గొనబోతున్నారు. మరోవైపు మరికొద్ది సేపట్లో రాహుల్ గాంధీ కులగణన వివరాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ కు వచ్చారు. మేధావులతో చర్చించి మాట్లాడుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version