సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి నూనె ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో…. నిత్యవసర ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో… సామాన్యులపై మరో భారం పడనుంది. త్వరలోనే ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయట. కిలో ఉల్లిగడ్డ ధరలు 100 రూపాయలకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మరో వారం లేదా పది రోజుల్లోనే.. కిలో ఉల్లిగడ్డ 100 రూపాయలు చేరే ఛాన్స్ ఉందని వ్యాపారస్తులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం కిలో… ఉల్లిగడ్డ ధర… 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. గత వారం రోజుల కిందట కిలో ఉల్లిగడ్డ ధర 30 నుంచి 40 రూపాయలు ఉండేది. కానీ ఒక్కసారిగా 70 రూపాయల వరకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో సాగు తగ్గడం అలాగే మార్కెట్లో సరిపడా ఉల్లిగడ్డలు రాకపోవడం కారణంగా… ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరిగినట్లు చెబుతున్నారు వ్యాపారస్తులు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఉల్లిగడ్డల స్టాక్ లేదని… అంటున్నారు. మరో రెండు లేదా మూడు నెలల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చు అని కూడా చెబుతున్నారు.