నేడు, రేపు తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష జరుగనుంది. టైమింగ్స్, రూల్స్ కూడా పకడ్భందీగా అమలు చేస్తున్నారు అధికారులు. రెండు సెషన్లలో తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.

రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష నిర్వహించనున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-4 పరీక్షలు జరుగనున్నాయి. 33 జిల్లాల్లో 1,358 కేంద్రాల్లో పరీక్షల నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
- ఈ రోజు రేపు గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు
 - మొత్తం 783 పోస్ట్ లు
 - 5 లక్షల 51 వేల 847 మంది దరఖాస్తు
 - రాష్ర్ట వ్యాప్తంగా 1368 సెంటర్ లు
 - అన్ని ఏర్పాట్లు చేసిన tgpsc
 - ఈ రోజు రెండు పేపర్ లు
 - రేపు రెండు పేపర్ లు
 - ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు
 - 9.30 గేట్స్ క్లోజ్
 - మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 గంటల వరకు పరీక్ష
 - 2.30 గంటలకి గేట్స్ క్లోజ్
 
