హైదరాబాద్ లో విమానాల రిపేర్ సెంటర్ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సాఫ్రాన్ సి.ఇ.ఓ ఆలివర్ అండ్రీస్ మాట్లాడుతూ… భారత్ తో మాకు 65 ఏళ్ల బంధం ఉందని.. ప్రస్తుతం భారత్ లో 750 మంది ఉద్యోగులన్నారని చెప్పారు.
ఈ కొత్త ఫెసిలిటీ సెంటర్ ద్వారా మరో 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన చేశారు. వరల్డ్ లో ఇదే లార్జెస్ట్ ఫెసిలిటీ సెంటర్ అని.. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా… భారత్ లోనే విమానాల ఇంజన్ లని తయారు చేయబోతున్నామని వెల్లడించారు.
హెలికాప్టర్ ల మనుఫ్యాక్షరింగ్ కోసం హెచ్.సి.ఎల్. తో ఒప్పందం కుదుర్చుకున్నామని.. హైదరాబాద్ లో రెండు ఫెసిలిటీ సెంటర్ లతో పాటు ముంబై లో ఒక ఫెసిలిటీ సెంటర్ ని ప్రారంభించబోతున్నామని ప్రకటన చేశారు సాఫ్రాన్ సి.ఇ.ఓ ఆలివర్ అండ్రీస్.