జిల్లా, నగర గ్రంథాలయ సంస్థల చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం చైర్మన్లు, సభ్యుల పదవులను నామినేటెడ్ విధానంలో నియమించింది. కొత్త ప్రభుత్వం రావడంతో వీరి పదవులను రద్దు చేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం జీవో ఇచ్చారు. 33 జిల్లాలకు జిల్లా గ్రంధాలయ సంస్థలు ఉన్నాయి. త్వరలోనే ఆయా పదవులను కాంగ్రెస్ ఇదే విధానంలో భర్తీ చేయనుంది.
ఇది ఇలా ఉండగా, ఆరోగ్యశాఖలో 6వేల పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఈనెల 8వ తేదీలోగా ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. 6 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటిలో సుమారు 3 వేల డాక్టర్ పోస్టులు, మిగతావి పారామెడికల్, అడ్మినిస్ట్రేషన్ సంబంధిత పోస్టులు ఉంటాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.