మా పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమయాత్ర – వైఎస్ షర్మిల

-

రేపటి నుంచి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరించారు. పిబ్రవరి 2 నుంచి పాదయాత్ర చేయాలని అనుమతి ఇచ్చారు పోలీసులు. 15 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు వరంగల్ పోలీసులు. పోలీసుల అనుమతి మేరకు ఫిబ్రవరి 2న ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం కానుంది.

నర్సంపేట నియోజక వర్గం శంకరమ్మ తాండా గ్రామం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే 3512 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు షర్మిల. మరో 4 వేల కిలోమీటర్ల మైలు రాయి చేరుకునేలా ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగిలిన 8 నియోజక వర్గాలో పాదయాత్ర కొనసాగించనున్నారు. వరంగల్ జిల్లా ముగించుకొని మరలా పాలేరు నియోజక వర్గంలో అడుగు పెట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

ఫిబ్రవరి మూడో వారంలో పాలేరు నియోజక వర్గంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు సభని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ.. మా పాదయాత్ర కేసీఅర్ పాలనకు అంతిమ యాత్ర అన్నారు. మా గొంతు నొక్కేందుకే 15 కండీషన్లు పెట్టారని ఆరోపించారు షర్మిల. కండీషన్లు పెట్టినా ప్రజా సమస్యలు తెలుసుకోవడమే మా కర్తవ్యం అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version