గవర్నర్ వ్యవస్థని రద్దు చేసేవరకు మా పోరాటం ఆగదు – కూనంనేని

-

గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నచోట కేంద్రం గవర్నర్లతో పెత్తనం చలాయిస్తుందని మండిపడ్డారు. సిపిఐ చలో రాజభవన్ నేపథ్యంలో రాజభవన్ కి ర్యాలీగా బయలుదేరిన సిపిఐ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉధృక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని, చాడ వెంకట్ రెడ్డి, తదితర నేతలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై బిజెపి కార్యకర్తలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు కూనంనేని.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version