వచ్చే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు గెలుస్తాం – సీఎం జగన్

-

సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చే కల్లబొల్లి హామీలను నమ్మొద్దన్నారు. మన బిడ్డను ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఇకపై గడపగడపకు మీరు కూడా వెళ్లడం ఇక మొదలు కావాలి. ప్రతి 50 ఇళ్లకు ఒకరిని మ్యాపింగ్ జరగాలని కోరారు.

మరో 18 నెలల్లో జరిగే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు సాధించాలని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతి అడుగు అలాగే వేయాలని, దేవుడి దయ ప్రజల చల్లని దీవెనలు ఈ ప్రభుత్వానికి ఉండాలన్నారు.

‘బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు. బీసీలు అంటే వెన్నెముక కులాలు. నా బీసీ కుటుంబం, జన సముద్రంలా వుంది. మీ హృదయంలో జగన్, నా హృదయంలో మీరు. ఈ దేశ సాంస్కృతికి ఉన్నంత చరిత్ర బీసీలకు వుంది. నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు. ఉన్నత విద్యను దూరం చేయడం వల్లే బీసీలు వెనుకబడ్డారు’ అని విజయవాడలో జరిగిన జయహో బీసీ సభలో జగన్ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version