చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత వహించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. టీటీడీ లో పోలీసుల పాత్ర నామ మాత్రంగా ఉంటుందని పేర్కొన్నారు.
టీటీడీ EO, ఛైర్మన్ ఏం చెప్తే పోలీసులు అదే చేస్తారని తెలిపారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. అధికారులను బలి పశువులను చేయకుండా నిజమైన బాధ్యులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.