పిడుగురాళ్లలో డయేరియా కేసుల విజృంభణ..ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం!

-

పిడుగురాళ్లలో డయేరియా కేసుల విజృంభణ కొనసాగుతోంది. అయితే..పిడుగురాళ్లలో డయేరియా కేసులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించనున్నారు. డయేరియాకు కారణాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ. మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి పైప్ లైన్ల లీకేజిలను అరికట్టినట్లు చెప్పిన కమిషనర్….పట్టణంలోని బోర్లను మూసేసి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

Outbreak of cases of diarrhea in thunderstones

డయేరియా కేసులు పెరగకుండా శానిటేషన్, బ్లీచింగ్,మురుగు కాలువల్లో స్ప్రే చేయడం,ఫాగింగ్ చేస్తున్నట్లు తెలిపిన కమిషనర్….పట్టణంలో డయేరియాను అదుపులోకి తెచ్చేలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పల్నాడు జిల్లా వైద్యారోగ్య అధికారి రవి. అటు సున్నా కేసులు తీసుకొచ్చే వరకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది DMHO. డయేరియా నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మున్సిపల్, వైద్యారోగ్య అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారు.
పారిశుధ్యం విషయంలో అప్రమత్తంగా ఉండి డయేరియా రాకుండా అరికట్టాలని అధికారులకు సూచనలు చేశారు. కేసులు తగ్గిన తర్వాత కూడా మరికొన్ని రోజులు స్పెషల్ డ్రైవ్ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. పిడుగురాళ్ల లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు వివరించాలని ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version