ఏపీకి బీపీసీఎల్, చమురు సంస్థలు, విన్ ఫాస్ట్ కంపెనీలు రాబోతున్నాయి. ఈ విషయంపై దేవినేని ఉమ ప్రకటన చేశారు. జగన్ రెడ్డి విధ్వంస పాలనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. కమిషన్లు, వాటాలు అంటూ కంపెనీలను వెళ్లగొట్టారని ఆగ్రహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు.
బీపీసీఎల్, చమురు సంస్థలు, విన్ ఫాస్ట్ స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పన. నెల రోజులు గడవక ముందే రాష్ట్రానికి ఆదాయం తో పాటు లక్షలాది ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. గత ఐదేళ్లలో వందల కోట్ల విలువైన పోలవరం కాల్వగట్ల మట్టి,గ్రావెల్ దోచేశారు.
మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో యదేచ్ఛగా అక్రమ గ్రావెల్ దోపిడి. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలింపు అన్నారు. జగన్ హయాంలో పోలవరం కాలువ గట్ల తవ్వకాలపై ప్రభుత్వం విచారణ చేసి అక్రమార్కుల ఆట కట్టించి సొమ్ము రికవరీ చేస్తుందని వివరించారు.