అంచనాలకు తగ్గట్టే ‘చేవెళ్ల విజయ సంకల్ప సభ’లో కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలా వద్దా?.. ఢిల్లీలోని ప్రధాని మోదీకి వినపడేలా ప్రజలు నినాదించాలని అని అమిత్‌షా పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీక్ అవుతోందని, పేపర్ లీకేజీలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్పందించలేదని తప్పుబట్టారు. అయితే, కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వాక్యాలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తప్ప తెలంగాణ అభివృద్ధిపై బీజేపీకి ఎలాంటి విజన్ లేదని విమర్శించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్న విషయాన్ని అమిత్ షా గుర్తుంచుకోవాలన్నారు. ఇక హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ‘ఓవైసీ’ అనే ఏడుపు ఇంకెంతకాలమని ప్రశ్నించారు.