ముత్తిరెడ్డి మద్దతుతో జనగాంలో జెండా ఎగరవేద్దాం : పల్లా

-

ముత్తిరెడ్డి మద్దతుతో జనగాంలో జెండా ఎగరవేద్దామని పల్లా రాజేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి తన సోషల్‌ మీడియాలో పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎన్నికలపై పోస్టులు పెట్టాడు. పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన ట్వీట్లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్ర ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే జనగామ టికెట్ పల్లాకే అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుండగా… ఆయన చేసిన ట్వీట్లు… అందులోని వీడియోల్లో ఆయన వాక్యాలు చర్చనీయాంశంగా మారాయి.

RTC Chairman post for Muthireddy Yadagiri Reddy

సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మద్దతు… సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో జనగామలో మరోసారి బీఆర్ఎస్ జండా ఎగరవేద్దామంటూ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లలో ఉన్న వీడియోలో… ఎక్కడైనా మార్పు జరగాలనుకున్నప్పుడు ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను ఒప్పించి ముందుకు సాగాలంటూ కార్యకర్తలతో పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. స్టేషన్ ఘన్పూర్ లోను ఎమ్మెల్యే రాజయ్యను ఒప్పించి… కడియం శ్రీహరికి మద్దతు ఇప్పించారని… దీంతో తాము రాజయ్యను కలిసి మాట్లాడామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version