జగిత్యాల జిల్లాలో పంచాయతీ భవనం తాకట్టు పెట్టడంపై…హరీష్ రావు సెటైర్లు వేశారు. జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఇలా పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టో లో స్థానిక సంస్థలకు “నిధులు, విధులు, మరియు నిర్వహణ” పూర్తి స్థాయి లో అప్పగిస్తాం అని బీరాలు పలికారని చురకలు అంటించారు.
ఇప్పుడు మాజీ సర్పంచులు పంచాయితీ భవనాలను తాకట్టు పెట్టే స్థితికి దిగజార్చారని చురకలు అంటించారు. సర్పంచులు, MPTC లకు , ZPTC లకు గౌరవ వేతనం పెంచుతాం అని మభ్యపెట్టారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఉన్న జీతాల బకాయిలకే దిక్కులేకుండా చేసారని తెలిపారు. గ్రామపంచాయితీ సిబ్బందికి కనీస వేతనం, మాజీ సర్పంచులు, MPTC, ZPTC సభ్యులకు గౌరవ పెన్షన్ గురించి కాంగ్రెస్ ఎన్నో ఆశలు కల్పించిన మాటలు రేవంత్ సర్కారు కు గుర్తు ఉందా?? అని నిలదీశారు.
మీరు చూపించిన “అరచేతి” లో స్వర్గం అటుంచి బకాయిలు ముందు విడుదల చేయండి భట్టి గారు?? అంటూ ఫైర్ అయ్యారు.
జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఇలా పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది.
కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టో లో స్థానిక సంస్థలకు
“నిధులు, విధులు, మరియు నిర్వహణ”
పూర్తి స్థాయి లో అప్పగిస్తాం అని బీరాలు పలికారు.… pic.twitter.com/V6fcLhb7GQ
— Harish Rao Thanneeru (@BRSHarish) November 9, 2024