ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో దొరికిన ఊరట!

-

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. కొత్త అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ క్రమంలోనే గతంలో ఆయన మీద నమోదైన ఎన్నికల హింసకు సంబంధించిన కేసుల దర్యాప్తును న్యాయమూర్తి నిలిపివేశారు. 2020లో ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం క్యాపిటల్ హిల్ మీద చెలరేగిన హింసకు చెందిన కేసుల్లో ట్రంప్‌న నిందితుడిగా చేర్చారు.

తాజాగా ఆ కేసు విచారణను పక్కనబెట్టాలని స్పెషల్‌ కౌన్సిల్‌ జాక్ స్మిత్ కోరారు. యూఎస్ డిస్ట్రిక్ జడ్జి తాన్య ఛుట్కాన్ సైతం అంగీకారం తెలిపారు. పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న అధికారిక చర్యలపై మాజీ అధ్యక్షులకు ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపును ఇచ్చే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే కేసు కొనసాగుతుందని స్మిత్ వాదించారు. దీనిపై ట్రంప్ లాయర్లు నవంబర్ 21లోపు స్పందించాల్సి ఉంది.ప్రాసిక్యూటర్లు ఎలా ముందుకు వెళ్లాలనే ప్రతిపాదనను డిసెంబర్ 2లోగా జడ్జికి తెలియజేస్తారని స్మిత్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version