మొన్నటివరకు తెలంగాణలో సంచరించిన మహిళా అఘోరీ రాష్ట్ర పోలీసులు మహారాష్ట్ర బోర్డర్‌లో వదిలేసి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఇలా చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల మహిళా అఘోరీ శ్రీ కాళహస్తి వద్ద తనను గుడిలోకి అనుమతించలేదని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వగా ఆమెకు ఏమీ కాలేదు.
తాజాగా ఆ అఘోరీ మీద ఉప్పల్ బాలుసంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అఘోరీ కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోంది.ఓ ఇంటర్వ్యూలో తనకు పీరియడ్స్ వస్తాయని చెప్పింది. అదంతా తప్పు. పుట్టుకతోని మహిళ అయితే వస్తాయి. ఆమె ఆపరేషన్ చేయించుకుని అలా అయ్యింది. నేను కూడా ఆపరేషన్ చేయించుకున్నా.. నాకు ఎందుకు పీరియడ్స్ రావడం లేదు. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తా అంటే చేయ్ తప్పులేదు.కానీ, జనాలను తప్పుదారి పట్టించొద్దు’ అని ఉప్పల్ బాలు వ్యాఖ్యానించారు.