తెలంగాణలో అభ్యర్థుల ప్రకటన నుంచి నామినేషన్ల పర్వం ముగిసే వరకు ఒక కురుక్షేత్రమే జరిగిందని చెప్పవచ్చు. టికెట్ ఆశించిన అభ్యర్థులు, ఆశావహులు బిఆర్ఎస్ పై, కాంగ్రెస్ పై నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రచారంపై పెట్టారని చెప్పవచ్చు. కొన్ని నియోజకవర్గాలు నామినేషన్ వేసే ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు ఎవరో తెలియకుండానే విపరీతమైన ఉత్కంఠ కొనసాగిందని చెప్పవచ్చు. అటువంటి నియోజకవర్గాలలో ముఖ్యమైనది పటాన్ చెరు నియోజకవర్గం.
ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థిగా మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఈయన గత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి గెలవాలని తన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పటాన్ చెరు నుంచి నీలం మధు బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. నీలం మధు పార్టీ మారి కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ గతంలో పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కి మళ్ళీ టికెట్ ఇవ్వడంతో నీలం మధు ఏమి చేయాలో తెలియక ఆఖరి నిమిషంలో బిఎస్పీ లో చేరి నామినేషన్ వేశారు. నియోజకవర్గంలో తనకి పట్టుందని అందుకే ఏ పార్టీ నుంచి నామినేషన్ వేసిన గెలిచి తీరుతానని నీలం మధు ధీమాతో ఉన్నారు.
పటాన్ చెరులో సెటిలర్స్, ముదిరాజ్ ఓట్లే కీలకం. బిఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డికి మాస్ లో మంచి పట్టు ఉంది. నీలం మధుకు ఫాలోయింగ్ ఎక్కువే. గ్రామీణ ప్రాంతాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అటు మహిపాల్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. మహిపాల్ రెడ్డికి కార్మిక సంఘాల మద్దతు ఉంది. దానితోపాటు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనలో మహిపాల్ రెడ్డి ముందున్నారని చెప్పవచ్చు.
అయితే ఈసారి పటాన్ చెరు లో ఎవరు గెలుస్తారో చూడాలి.