పటాన్‌చెరు పోరు రసవత్తరం..కారుకు బ్రేకులు పడతాయా!

-

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకూలమైన స్థానం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ బి‌ఆర్‌ఎస్ హవా నడుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది..కాంగ్రెస్ నుంచి నందీశ్వర్ గౌడ్ గెలిచారు. ఇక రాష్ట్రం వచ్చాక కారు హవా మొదలైంది. 2014 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి గూడెం మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. టి‌డి‌పిపై 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇక 2018 ఎన్నికల్లో మరోసారి మహిపాల్ రెడ్డి సత్తా చాటారు. బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి దాదాపు 37 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పై గెలిచారు. ఇలా రెండోసారి గెలిచిన మహిపాల్..నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేస్తున్నారు. కాకపోతే కొన్ని అంశాలు ఆయనకు మైనస్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఆయన కుమారుడు విష్ణు వర్థన్ చిరు వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దందాలు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అదే సమయంలో ఇక్కడ గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇక్కడ బి‌ఆర్‌ఎస్ యువ నేత నీలం మధు పటాన్‌చెరు సెగ్మెంట్‌లో పలు కార్యక్రమాలు చేస్తూ దూకుడు పెంచారు. పైగా ఈయన కే‌టి‌ఆర్ అనుచరుడు..అటు ఎమ్మెల్యే మహిపాల్ ఏమో మంత్రి హరీష్ సన్నిహితుడు..అయితే నెక్స్ట్ కే‌టి‌ఆర్ సి‌ఎం అని, అలాగే మధుకు నెక్స్ట్ పటాన్ చెరు సీటు ఖాయమని ఆయన వర్గం ప్రచారం చేస్తుంది. దీంతో ఎమ్మెల్యే మహిపాల్‌కు ఇబ్బందిగా మారింది.

ఇక ఇక్కడ కాంగ్రెస్, బి‌జే‌పిలు బలపడుతున్నాయి. ఆ రెండు పార్టీల్లో కూడా గ్రూపు తగాదాలు ఉన్నాయి. పటాన్ చెరు బి‌జే‌పి సీటు కోసం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, యువ నేత శ్రీకాంత్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడు కనిపించడం లేదు. మొత్తానికి పటాన్ చెరులో ఈ సారి కారు పార్టీని నిలువరిస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version