కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. అయితే… కస్టడీ లో ఉన్న నరేందర్ రెడ్డి తమకు సహకరించట్లేదంటూ నివేదిక ఇచ్చారు పోలీసులు. మరో రెండు రోజులపాటు కస్టడీనీ పొడిగించాలని పోలీసులు కోరుతున్నారు. Lagacharla ఘటనల్లో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నీ కోర్టు అనుమతితో రెండు రోజులు కస్టడీ కి తీస్కుని విచారించారు పోలీసులు.
అయితే పట్నం విచారణ కు సహకరించ లేదని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని నివేదించారు పోలీసులు. మరో ప్రధాన నిందితుడు సురేష్ ఇచ్చిన వివరాల ఆధారంగా కోస్గి కి చెందిన ఎక్సైజ్ అధికారుల నుండి మద్యం విక్రయాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఘటనలకు ముందు స్థానికులకు సురేష్ మందు పార్టీలు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పట్నం సురేష్ ను కలిపి విచారించడానికి మరి కొన్ని రోజులు కస్టడీ కి ఇవ్వాలని కోర్టు ను పోలీసులు కోరనున్నట్లు సమాచారం అందుతోంది.