ధరణీ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కమిషనర్ నవీన్ మిట్టల్

-

ధరణీ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇవాళ కలెక్టర్లకు సూచించారు. ధరణీ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన సీసీఎల్ఏ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ లో మాట్లాడారు. ధరణీ సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా రూపొందించిన నూతన ఆర్.ఓ.ఆర్ ముసాయిదా బిల్లు 2024 పై ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్ సైట్ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలలో పెండింగ్ లో ఉన్న ధరణీ దరఖాస్తులను ప్రణాళికబద్దంగా పరిష్కరించాలని కమిషనర్ సూచనల మేరకు వీలైనంత త్వరగా పెండెన్సీ పూర్తి చేయాలని సూచించినట్టు కలెక్టర్లు తెలిపారు. తహశీల్దార్, రెవెన్యూ, డివిజనల్ అధికారి స్థాయిలలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను రికార్డులు పరిశీలించడంతో పాటు డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించాలని ఆదేశించారు. ధరణీ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజు వారిగా పరిశీలన జరపాలని ఆర్డీఓలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version