ఉప్పొంగిన పెన్ గంగ.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు

-

గత ఐదు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రహదారులపైకి నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది.

ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లాలోని వాగులు.. వంకలు పొంగి పొర్లుతున్నాయి. జైనథ్‌ మండలం డొలారా వద్ద పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెన్‌ గంగ ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకింది. ఈ క్రమంలో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని 44వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి తగ్గాక రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి డొలారా వంతెన వద్ద పెన్‌గంగ ఉద్ధృతిని పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లే వాహనాలను జైనథ్ మండలంలోని పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version