ఈఫిల్‌ టవర్‌ వద్ద.. ఒలింపిక్స్‌ కౌంట్‌డౌన్‌ షురూ

-

వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. పారిస్ లో 2024లో జరగనున్న ఒలింపిక్స్ కౌంట్ డౌన్ క్లాక్ ను ఈఫిల్‌ టవర్‌ కింద ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒలింపిక్స్‌ రింగ్స్‌ను సిటీ హాల్‌ ముందు ఉంచారు. 2024 జులై 26న పారిస్‌లో ఒలింపిక్స్‌ గేమ్స్ ఆరంభం కానున్నాయి. పారిస్‌లోని సీన్‌ నది పక్కన ఒలింపిక్స్‌ ఆరంభోత్సవానికి సంబంధించిన సాంకేతిక రిహార్సల్స్‌ను నిర్వహించారు. 39 బోట్లు ఇందులో పాల్గొన్నాయి.

ఒలింపిక్స్ కోసం కోటి 30 లక్షల మంది పారిస్‌కు విచ్ఛేస్తారని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. సందర్శకులకు సరిపడేలా పారిస్‌లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. రవాణా వ్యవస్థ, భద్రత, కేటరింగ్‌ వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టారు. కోటి 30 లక్షల మందికి భోజన సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఒలింపిక్స్‌ వల్ల పారిస్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాల్లో విక్రయాలు భారీగా పెరిగి ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరనుందని ఫ్రాన్స్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version