మ‌రోసారి పెట్రో మంట‌.. నాలుగో సారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

-

వాహ‌న‌దారుల‌కు మ‌రోసారి పెట్రో మంట త‌గిలంది. ఈ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. దీంతో ఒక వారంలో నాలుగో సారి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్ పై 80 పైస‌లు, లీట‌ర్ డీజిల్ పై 80 పైస‌లు పెంచుతూ దేశంలో ఉన్న చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. కాగ ఇటీవ‌ల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఉన్న స‌మ‌యంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌లేదు. కానీ ఈ మ‌ధ్య కాలంలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి.

అలాగే ఫ‌లితాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు వ‌రుస‌గా పెట్రోల్, డీజిల్ ధ‌రలు పెరుగుతూనే ఉన్నాయి. కాగ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప‌లువురు నిపుణులు.. ఎన్నిక‌ల త‌ర్వాత పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. ఈ అంచ‌నాలు అన్ని కూడా నిజం చేస్తూ.. వారం రోజుల్లో నాలుగో సారి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. గ‌డిచిన 5 రోజుల్లో 4 సార్లు ధ‌ర‌లు పెర‌గ‌గా.. లీట‌ర్ పెట్రోల్ ధ‌రపై రూ. 3.20 వ‌ర‌కు పెరిగింది. కాగ తాజా ధ‌ర ప్ర‌కారం..

తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 111.71 కు చేరుకుంది. అలాగే లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 98.30 కి చేరింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 113.56 కి చేరింది. అలాగే లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 99.54 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version