జైలులో ఉండగానే ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్ రావు అరెస్ట్..!

-

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా పీటీ వారెంట్ పై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని, రూ. 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకే మరొకరికి ఇప్పించారని రాధాకిషన్ రావు పై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇవాళ పీటీ వారెంట్ కింద అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరిచి అదుపులోకి తీసుకున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుది కీలక పాత్ర అని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన డేటా ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్లను ఉపయోగిచిన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ఈ సమాచారం బయటకు వస్తే ఎక్కడ తమ భండారం బయటపడుతుందనే భయంతోనే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్నతో కలిసి డేటాను ధ్వంసం చేసినట్లు దర్యాప్తు బృందం ఇదివరకే గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version