ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగిన వినోద్‌కుమార్‌

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం షురూ అయింది. తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు గుడ్ బై చెప్పారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తన రాజీనామా ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి అందజేయగా.. ప్రభాకరరావు తన రాజీనామా లేఖను రాష్ట్ర విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఇచ్చారు. ప్రభుత్వం కొత్త సీఎండీలను నియమించేవరకూ జెన్‌కో బాధ్యతలను డైరెక్టర్‌ అజయ్‌కు, ట్రాన్స్‌కో బాధ్యతలను జేఎండీ సి.శ్రీనివాసరావుకు అప్పగించారు.

రాజీనామాలు సమర్పించిన కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే..

  • సోమ భరత్‌కుమార్‌(రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌)
  • జూలూరు గౌరీశంకర్‌(తెలంగాణ సాహిత్య అకాడమీ)
  • పల్లె రవికుమార్‌గౌడ్‌(రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్‌)
  • రామచంద్ర నాయక్‌(ట్రైకార్‌)
  • వలియా నాయక్‌(గిరిజన ఆర్థిక సహకార సంస్థ)
  • వై.సతీశ్‌రెడ్డి(రెడ్కో)
  • డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌(రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)
  • కోలేటి దామోదర్‌ గుప్తా (పోలీసు గృహనిర్మాణ సంస్థ)
  • రవీందర్‌ సింగ్‌(పౌరసరఫరాల సంస్థ)
  • జగన్మోహన్‌రావు(రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌)
  • డాక్టర్‌ వాసుదేవరెడ్డి(వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ)
  • మన్నె క్రిశాంక్‌(ఖనిజాభివృద్ధి సంస్థ)
  • గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌(పర్యాటక అభివృద్ధి)
  • అయాచితం శ్రీధర్‌(గ్రంథాలయ సంస్థ)
  • రమణాచారి(బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌-ప్రభుత్వ సలహాదారు)
  • జ్వాలా నరసింహారావు(బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఉపాధ్యక్షుడు)
  • డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌(క్రీడా ప్రాధికార సంస్థ)
  • మేడె రాజీవ్‌సాగర్‌(టీఎస్‌ ఫుడ్స్‌)
  • దూదిమెట్ల బాలరాజు యాదవ్‌(గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ)
  • గూడూరు ప్రవీణ్‌(టెక్స్‌టైల్స్‌)
  • గజ్జెల నగేశ్‌(బెవరేజెస్‌)
  • అనిల్‌ కూర్మాచలం(ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌)

Read more RELATED
Recommended to you

Exit mobile version