అక్టోబర్ 14న బేజీపీ రథయాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ

-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా విజయకేతవం ఎగురవేయాలని బలంగా ప్రయత్నిస్తోంది బీజేపీ. ఆ దిశగా కార్యాచరణ చేపడుతోంది. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. మూడు రూట్లలో మూడ్రోజులు రథయాత్ర ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ యాత్రలు అక్టోబర్ 14న ఓకే చోట ముగించేలా రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది.

యాత్రలు ముగిసే నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌లో ముగింపు సభను నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించేలా బీజేపీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రథయాత్రలతో ఎన్నికల రణభేరి మోగించేందుకు సిద్ధమవుతున్న బీజేపీ .. యాత్రలో భాగంగా రోజు 2 నియోజకవర్గాలను చుట్టేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసింది.  అసెంబ్లీ నియోజక కేంద్రాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, కేంద్ర మంత్రులని రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version